కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా రెండున్నరగంటల పాటు చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం. రాజ్యసభ సభ్యులను ఖరారు చేసే విషయంపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. ఇటీవల కల్తీ లడ్డు వ్యవహారంపై జరిగిన పరిస్థితి మీద చర్చించినట్టు తెలుస్తోంది. కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. జనసేన, టీడీపీ, నేతలు అన్ని నియోజకవర్గాల్లో సమన్వయంతో పనిచేయాలని ఇద్దరు నేతలు ఒక చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
Read Also: ఆంధ్రావర్సిటీ కల్చర్ బ్లాక్‌కు గద్దర్ పేరు పెట్టండి.. చంద్రబాబుకు రిక్వెస్ట్
Follow Us On: Sharechat


