epaper
Wednesday, February 18, 2026
epaper

వరంగల్‌లో మిర్చికి ఆల్ టైం రికార్డు ధర..!

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో (Enumamula Agricultural Market) మిర్చికి ఆల్ టైమ్ రికార్డు ధర నమోదైంది. వండర్ హాట్ మిర్చి ధర క్వింటాల్‌కు రికార్డు స్థాయిలో రూ.37,100 పలికింది. బుధవారం రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన మిర్చికి ఈ ధర వచ్చింది. గత నెల రోజులుగా రైతులు తీసుకొస్తున్న మిర్చికి ధరలు (Chilli Prices) క్రమంగా పెరుగుతున్నాయి. తేజ మిర్చి క్వింటాల్‌కు రూ.19,000 నుంచి రూ.20,000 వరకు పలుకుతోంది.

వండర్ హాట్ మిర్చి ధర క్వింటాల్‌కు రూ.30,000 నుంచి రూ.37,000 వరకు, దేశీ రకం మిర్చికి క్వింటాల్‌కు రూ.35,000 నుంచి రూ.41,000 వరకు ధర లభిస్తోంది. ఈ ఏడాది మిర్చి విస్తీర్ణం తగ్గడం వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు తెలిపారు. గడిచిన కొన్ని రోజులుగా మిర్చికి ధరలు (Chilli Prices) పెరుగుతున్నాయని వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశం వెల్ల‌డించారు.

 Read Also: విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డ‌మే బీజేపీ ప‌ని: టీపీసీసీ చీఫ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>