epaper
Wednesday, February 18, 2026
epaper

రాజమండ్రి సమీపంలో పెద్దపులి.. ప్రజలను అలర్ట్ చేసిన ఎమ్మెల్యే

కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రి(Rajahmundry) సమీపంలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పెద్దపులి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. గత రాత్రి సుమారు 9 గంటల సమయంలో పెద్దపులి తిరుగుతూ ఉండగా సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎస్వీపీసీ (SVPC) ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చిన పెద్దపులి, అక్కడి నుంచి పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, పెద్దపులి కదలికలపై నిఘా పెంచారు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ (Bathula Balaramakrishna) స్పందిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖ అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపులి ఆచూకీపై అధికారులు నిరంతరం పరిశీలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>