మోసం చేయడానిక సైబర్ నేరగాళ్లు ఏకంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) పేరునే వాడేశారు. సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి.. తెలిసిన వాళ్లకు అవసరంలో ఉన్నా, డబ్బులు పంపించండి అంటూ సందేశాలు పంపారు. ఈ అంశం తన దృష్టికి రావడంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. తన పేరుతో వచ్చే అలాంటి సందేశాలకు స్పందించవద్దంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘నా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు ‘నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి’ అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారని చెప్పారు. దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని తన స్నేహితుడు ఒకరు ₹20,000 ను మోసగాళ్ల ఖాతాకు పంపారని వెల్లడించారు. ఈ సందర్భంగానే తన వ్యక్తిగత ఫేస్‌బుక్ ఖాతా లింక్‌ను ఆయన షేర్ చేసుకున్నారు. https://facebook.com/share/1DHPndApWj/ ఇది మినహా తన పేరుతో ఉన్న మిగతా ఖాతాలన్నీనకిలివేనని స్పష్టం చేశారు.
ఈ ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైం టీం తొలగించే పనిలో ఉందని చెప్పారు. తన పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వచ్చే రిక్వెస్ట్‌లను స్పందించకండని తెలిపారు.. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మద్దని, ఒకవేళ అలా ఎవరైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్ లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని, సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా http://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని చెప్పారు. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే… సైబర్ నేరగాళ్ల(Cybercriminals) బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలమని ఆయన(CP Sajjanar) పేర్కొన్నారు.
Read Also: తెలంగాణ హైకోర్టు సైట్ హ్యాక్..
Follow Us on : Reddit

