తెలంగాణ హైకోర్టు(TG High Court) వెబ్‌సైట్ హ్యాక్‌కు గురయింది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించిన హైకోర్టు రిజిస్ట్రార్.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఈ హ్యాక్ ఎప్పుడు జరిగింది? ఎప్పటి నుంచి బెట్టింగ్ సైట్‌ను రీడైరెక్ట్ అవుతుంది? దీని వెనక వరు ఉన్నారు? ఇప్పటి వరకు ఎవరైనా అమాయకులు ఈ బెట్టింగ్ వలలో పడ్డారా? ఎవరైనా మోసపోయారా? వంటి కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఐపీ అడ్రెస్‌ల ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్
Follow Us on : ShareChat

