కలం, జనగామ : సీపీఐ అభ్యర్థికి టికెట్ కేటాయించడం జనగామ (Jangaon) కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. జనగామ మున్సిపాలిటీ 11వ వార్డు టికెట్ ను పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి ఆకుల సరస్వతికి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై 11వ వార్డు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జనగామ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆఫీస్ ముందు సొంత పార్టీల నేతలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. 11వ వార్డు టికెట్ పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థికి ఇవ్వడంతో సమంజసం కాదని.. కాంగ్రెస్ నాయకులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అందరం కలిసి సీపీఐ అభ్యర్థిని ఓడిస్తామంటూ, కార్యాలయం ముందు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.


