epaper
Wednesday, February 18, 2026
epaper

కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా ఎగరడం ఖాయమా?

కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం కార్పొరేషన్ పై (Kothagudem Corporation) ఎర్రజెండా ఎగరాలని సిపిఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గట్టి పట్టుదలతో కృషి చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులకు కొత్తగూడెం సిపిఐ కార్యాలయం లో ఆయన మంగళవారం బి ఫారాలను అందజేశారు. ఈనెల 11న జరగనున్న కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా సిపిఐ తన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు అనూహ్యంగా టిడిపి (TDP)తో జత కట్టింది. టీడీపీకి ఐదు స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. పూర్తిగా పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్తగూడెం కార్పొరేషన్ లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యమంత్రి, మంత్రులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నామనే భావన వద్దని, స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాల్లో భాగంగానే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామనే సంకేతాలు రాకుండా సీపీఐ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కునంనేని మాటల ద్వారా తెలుస్తోంది. గత రెండేళ్లలో కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు జరిగాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం మౌళిక సదుపాయాల కల్పనకు శక్తివంచన లేని కృషి చేసి ఎన్నడూ జరగని అభివృద్ధి కొత్తగూడెం నియోజకవర్గంలో చేయడం తో పాటు అనుక్షణం ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నామనే కునంనేని మాటలు అభివృద్ధి ప్రాతిపదికనే ఓట్లు అడగబోతున్నారని స్పష్టం అవుతుంది.

కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ పరిధిలో 25 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఆ ప్రాంత అభివృద్ధి శరవేగం కానుంది. కార్పొరేషన్ కాకుండా అనేక శక్తులు కుట్రలు పన్నాయని, వారి కుట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేస్తూ తామిచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం అనతికాలంలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌ను (Kothagudem Corporation) ప్రకటించిందంటూ.. కార్పొరేషన్ ఏర్పాటులో తన పాత్ర ఎంత కీలకమో కునంనేని వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలనే.. కునంనేని వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. సిపిఐ అభ్యర్థులు గెలవడం ద్వారా కొత్తగూడెం కార్పొరేషన్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోనుందని, ప్రతీ కార్యకర్త సైనికుల్లా పని చేస్తే కార్పొరేషన్ పీఠంపై ఎర్ర జెండా ఎగరడం ఖాయం అని సిపిఐ కార్యకర్తలను, నాయకులను కునంనేని ఉత్సాహ పరిచారు.

Read Also: నా చివరి శ్వాసదాకా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తా : కోమటిరెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>