epaper
Wednesday, February 18, 2026
epaper

జగిత్యాలలో ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మహిళా కూలీలు దుర్మరణం

కలం, వెబ్ డెస్క్: జగిత్యాల (Jagtial) జిల్లా మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని మొగిలిపేట గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పని ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు 15 మంది మహిళా కూలీలు పొలంలో పసుపు కోత పనుల కోసం వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని పసుపు లోడుతో ఉన్న ట్రాక్టర్‌పై ఎక్కి తిరిగి వస్తుండగా, మొగిలిపేట శివారులోకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ (Tractor)  ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 Read Also: కాంగ్రెస్ హయాంలో రౌడీల రాజ్యం : బీజేపీ ఖమ్మం అధ్యక్షుడు కోటేశ్వరరావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>