కలం, వెబ్‌డెస్క్: భారత్‌పై విధించిన 25శాతం టారిఫ్స్‌ను 18శాతానికి తగ్గించారు ట్రంప్ (India US Trade Deal). అదే సమయంలో ఇండియా కూడా తమ వస్తువుల్లో కొన్నింటిపై జీరో టారిఫ్‌కు అంగీకరించిందని చెబుతున్నారు. ముఖ్యంగా తమ లగ్జరీ బైక్‌లపై ఇండియా భారీగా టారిఫ్‌లు వేస్తున్నదని మొదటి నుంచి మండిపడుతున్న ట్రంప్.. ఇప్పుడు దాన్ని జీరోకు చేస్తుందని, అలా ఒప్పందం కుదిరిందని అంటున్నారు. నిజంగా జీరో టారిఫ్‌కు ఇండియా ఒప్పుకుంటే, అమలు చేస్తే.. హార్లే డేవిడ్సన్ వంటి లగ్జరీ బైక్‌ల రేట్లు సగం వరకు తగ్గుతాయి. గతంలో హార్లే డేవిడ్సన్పై టారిఫ్ 100 శాతం వరకు ఉండేది. ఆ సుంకంతో కలిపి హార్లే డేవిడ్సన్ బైక్ మన దగ్గర రూ.20 లక్షలకు దొరికేది. కానీ.. జీరో టారిఫ్‌తో అది రూ.12 లక్షలకే వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఐఫోన్‌పై రూ.30 వేలు..
అమెరికా నుంచి వచ్చే యాపిల్ ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది (India US Trade Deal). ప్రస్తుతం వీటిపై ఇండియా విధిస్తున్న 22 శాతం టారిఫ్.. ఇకపై జీరో అయితే, రూ.30 వేల వరకు ధరలు దిగుతాయి. రూ.లక్షన్నర రేట్ ఉండే ఐఫోన్ ప్రోమోడల్ ధర రూ.లక్షా 20 వేలు కావొచ్చని బిజినెస్ వర్గాలు లెక్కగడుతున్నాయి. అయితే.. యాపిల్ ఫోన్లపై జీఎస్టీ ఎక్కువ ఉండటంతో వాటి ధర అంతగా తగ్గకపోవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
విస్కీ.. ఫుల్ కిక్కు!
జీరో టారిఫ్ వల్ల అమెరికా నుంచి దిగుమతి అయ్యే విస్కీ, స్పిరిట్ రేట్లూ తగ్గుతాయి. అక్కడి విస్కీపై మన దేశం ప్రస్తుతం 150 శాతం పన్ను వేస్తున్నది. ఆ పన్నుతో కలిపి ప్రస్తుతం పలు బ్రాండ్ల విస్కీల ధరలు రూ.3వేల నుంచి 10వేల వరకు ఉన్నాయి. టారిఫ్ జీరో అయితే.. వాటి రేటు సగానికి తగ్గుతుంది.
Read Also: టారిఫ్ కట్ ఎఫెక్ట్.. పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?
Follow Us On: Youtube


