epaper
Wednesday, February 18, 2026
epaper

పార్లమెంట్‌లో గందరగోళం.. వెల్‌లోకి దూసుకొచ్చిన సభ్యులు

కలం, వెబ్ డెస్క్: పార్లమెంటులో మంగళవారం తీవ్రమైన గందరగోళం నెలకొన్నది. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ పీఎం మోడీ సరెండర్’ అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో లోక్ సభలో కొన్ని నిమిషాల పాటు గందరగోళం నెలకొన్నది. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు సైతం నిరసన తెలిపారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని వారు ఆరోపించారు. ఏపీలో విపక్ష సభ్యులకు భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన జవాబు ఇవ్వాలంటూ విన్నవించారు. ఈ వివాదాల నేపథ్యంలో లోక్‌సభ (Lok Sabha) మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

Read Also: ఎవరితో పొత్తు ఉండదు.. ఒంటరిగానే పోటీ: మమతా బెనర్జీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>