Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని నరేంద్రమోదీకి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు

కలం, వెబ్ డెస్క్ : భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం తీసుకొచ్చేలా.. వారం వ్యవధిలోనే రెండు కీలక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

గత వారం యూరోపియన్ యూనియన్‌( EU) తో కుదిరిన ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పేరొందిన ఒప్పందం తరువాత, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ మరో కీలక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. ఈ ఒప్పందాలు దేశ ఆర్థిక భవిష్యత్తును మరింత బలోపేతం చేయనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా టారిఫ్ ఛార్జీలను 18 శాతానికి తగ్గించడం ద్వారా భారత రైతులకు అంతర్జాతీయ మార్కెట్లలో మెరుగైన అవకాశాలు లభించనున్నాయని, ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుందని పవన్ కల్యాణ్  వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సకాలంలో, దృఢమైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకీ పవన్  కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>