కలం, వెబ్‌డెస్క్: టెక్ ఉద్యోగులను ఏఐ పీడకలలా వెంటాడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు అల్లాడిపోతున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్‌కు మరో కంపెనీ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఇటీవలే అమెజాన్ 16వేల మంది ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు ఇంకో టెక్ దిగ్గజం ఒరాకిల్ సైతం ఇదే బాటను ఎంచుకుంది (Oracle Lay Off). ఈ మేరకు టీడీ కోవెన్ అనే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్బ్యాంక్, ఫైనాన్షియల్ కంపెనీ నివేదికను సీఐఓ.కామ్ వెల్లడించింది.
డేటా సెంటర్ల ఏర్పాటుకు..
సీఐఓ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏఐకి పెరుగుతున్న ప్రాధాన్యం ఒరాకిల్‌పై పడింది. ఏఐ ద్వారా టెక్నాలజీ ఇన్నోవేషన్స్, ఇంప్రూవ్మెంట్స్, న్యూ టెక్నాలజీస్ వేగంగా పూర్తవుతుండడంతో చాలా కంపెనీలు అటువైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో కొత్త ప్రాజెక్టులు రావాలంటే ఏఐ కీలకంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన ఒరాకిల్ ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. అయితే, ఇదంత సులభం కాదు. దీనికోసం భారీగా ఫండ్స్ అవసరమవుతాయి.
టీడీ కోవెన్ అంచనాల ప్రకారం… ఒరాకిల్ ఏర్పాటుచేయాలని అనుకుంటున్న డేటా సెంటర్లకు 156 బిలియన్ డాలర్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈక్విటీ, డెబ్ట్ ఇన్వెస్టర్లు ఒరాకిల్‌కు అంత మొత్తం సమకూర్చే పరిస్థితి లేదు. ఇటీవల కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఈ విషయంలో వెనక్కి తగ్గాయి కూడా. దీంతో ఒరాకిల్ ఖర్చు తగ్గించుకోవడం మినహా వేరే ఆప్షన్ కనిపించలేదు. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగాల కోతకు ఒరాకిల్ (Oracle Lay Off) సిద్ధమవుతున్నట్లు టీడీ కోవెన్ నివేదిక పేర్కొంది. త్వరలోనే 20వేల నుంచి 30వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది.
నిరుడు 10వేల మందిని తొలగించగా, 1.6బిలియన్ల మేర ఆదా కావడాన్ని ఒరాకిల్ ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు నివేదిక చెప్తోంది. అందువల్ల కంపెనీని విస్తరించాలన్నా, కొత్త డేటా సెంటర్లు ఏర్పాటుచేయాలన్నా ఉద్యోగాల కోత తప్పదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 20వేల నుంచి 30వేల వరకు ఉద్యోగాలు తగ్గించడం ద్వారా 8బిలియన్ల నుంచి 10 బిలియన్ల వరకు ఆదా అవుతుందని ఒరాకిల్ భావిస్తోంది. ఇది డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమయ్యే నిధుల్లో కొంతమేర భర్తీ చేసినట్లేనని అనుకుంటోంది.
కాగా, లేఆఫ్స్‌పై ఒరాకిల్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, కంపెనీ విస్తరణ ప్లాన్లు, డేటా సెంటర్ల ఏర్పాటు సాధ్యం కావాలంటే జాబ్స్ తగ్గించక తప్పదని టీడీ కోవెన్ రిపోర్ట్ చెబుతోంది.
Read Also: ఇరాన్లో భూకంపం.. భవనాలు ధ్వంసం
Follow Us On: Instagram


