epaper
Monday, February 2, 2026
spot_img
epaper

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సిట్ విచారణ : కేటీఆర్​

కలం, వెబ్​ డెస్క్​ : కాంగ్రెస్​ ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) సిట్ విచారణ చేయిస్తున్నారని మీడియా చిట్ చాట్​ లో ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణను ‘పైశాచిక ఆనందం’గా అభివర్ణించారు. కేసీఆర్ విచారణ సందర్భంగా 2000 మందిని అధికారికంగా పెట్టారు.. కానీ, అదే సమయంలో కోటిలో బ్యాంక్ దోపిడీ జరిగిందన్నారు. నల్లమల ద్వారా ఏపీ జల దోపిడీ చేస్తుంటే సీఎం రేవంత్​ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, రేవంత్ రెడ్డి తన బాస్ కోసం అన్యాయం చేయలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.

సింగరేణి (Singareni) విషయంలో ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కేటీఆర్​ డిమాండ్ చేశారు. సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే సరిపోతుందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బౌన్సర్లతో భూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి స్వయంగా కేసు నమోదు అయిందని ఒప్పుకున్నా, సీఐని బదిలీ చేశారన్నారు. బడ్జెట్​ పై కేటీఆర్ (KTR) స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి 60కి పైగా ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి ఏమీ తేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు, ఉపాధి హామీ, ఎరువుల సబ్సిడీ, ఆహార భద్రత, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు తగ్గించిందని ఆరోపించారు. తెలంగాణ పథకాలు దేశానికి రోల్ మోడల్ అయినా కేంద్రం కాపీ కొట్టిందని అన్నారు.

మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. మంత్రి వాహనం ధ్వంసం జరగడం, భక్తుల ఆగ్రహం బీఆర్​ఎస్​ ప్రభుత్వం రావడానికి నిదర్శనం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బ్లాక్‌మెయిల్‌కు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను పత్రికలు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. దావోస్ పర్యటనలు విఫలమయ్యాయని, పర్యటనపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్​ ట్యాపింగ్ కేసు ఉత్త కేసుగా అని, ఆధారాలు ఉంటే కోర్టులో పెట్టాలని సవాలు విసిరారు.

Read Also: లోక్​సభను తాకిన ‘ఎప్​స్టీన్’​ సెగ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>