కలం, వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ (Gurrampode) మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి (ACB Raid) నిర్వహించారు. ఒక భూమి వ్యవహారానికి సంబంధించి లంచం తీసుకుంటున్న మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆన్‌లైన్ ఆర్ఓఆర్ (1-బి రిజిస్టర్) లో భూమి వివరాల పునరుద్ధరణకు సంబంధించిన దరఖాస్తును ప్రాసెస్ చేసి, పై అధికారులకు పంపేందుకు సదరు ఆర్ఐ రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఈ క్రమంలో సోమవారం ఎంఆర్ఓ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు (ACB Raid) చేసి అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also: కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్
Follow Us On: Pinterest


