కలం, మెదక్ బ్యూరో: రాజకీయ నాయకులపైన, అధికారులపైన, వారి కుటుంబసభ్యులపైన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేయడం అతి నీచమైన నేరమని, దానికి సంబంధించి విచారణలో భాగంగా పిలిస్తే దానిని బీఅర్ఎస్(BRS) పార్టీ రాద్దాంతం చేస్తూ హింసాత్మక నిరసనలకు పిలుపునిచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంత్రి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణకు పిలిస్తేనే అంత బాధపడితే, ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది కుటుంబాలు, వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తే ఎంత బాధపడతారని ప్రశ్నించారు. రహస్య సమాచారాన్ని సేకరించి పలువురిని వేధించారని ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు, కుట్ర పూరితమైన అంశాలు లేవని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు ఏ తప్పూ చేయకపోతే విచారణలో వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు ధోరణి అంటూ ప్రచారం చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందటం మానుకోవాలని పొన్నం (Ponnam Prabhakar) సూచించారు.
Read Also: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సిట్ విచారణ : కేటీఆర్
Follow Us On: Instagram


