epaper
Monday, February 2, 2026
spot_img
epaper

కేసీఆర్​ సిట్​ విచారణపై కవిత కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ సిట్ విచారణపై జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. విచారణకు సహకరించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ సిట్​ విచారణపై బీఆర్ఎస్​ నేతలు అనవసర రాద్దాంతం చేశారని తప్పుబట్టారు. ‘కేసీఆర్​​ (KCR) ను సిట్  విచారణకు ఎలా పిలుస్తారు?’ అని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారి ఆలోచనలో మార్పు రావాలని లేకపోతే ఆ పార్టీని ఎవరూ బాగుచేయలేరని ఎద్దేవా చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. తనని కూడా సిట్ పిలిస్తే విచారణకు హాజరవుతానని కవిత స్పష్టం చేశారు.

కేంద్ర బడ్జెట్​ లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో సఖ్యంగా ఉంటున్నాం.. ప్రధాని తమకు పెద్దన్న అని చెబుతున్న సీఎం రేవంత్​ రెడ్డి బడ్జెట్​ లో రాష్ట్రానికి కేటాయింపులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లిన రేవంత్​ రెడ్డి తెలంగాణకు రూ.30 వేల కోట్లు కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​ కేంద్రం నుండి  నిధులు రాబాట్టాలని కవిత (Kavitha) డిమాండ్​ చేశారు.

Read Also: సిట్ చీఫ్ సజ్జనార్‌పై హ‌రీశ్ రావు ఫైర్‌

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>