కలం, నల్లగొండ బ్యూరో: మా పర్మిషన్ లేనిదే నల్లగొండలో ఎవ్వరూ మేయర్ కాలేరంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. డబ్బులు ఎవ్వరూ ఇచ్చినా తీసుకోండి. కానీ మన 9 మంది కార్పొరేటర్లను గెలిపించాలని కోరారు. నల్లగొండ పట్టణంలో 26 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి ఉందని, కొన్ని అతీత శక్తులు కాజేయాలని చూస్తే ఎంఐఎం కాపాడిందని గుర్తుచేశారు. లతీఫ్ షా దర్గా రోడ్డు కోసం కూడా కొట్లాడామని తెలిపారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల కోసం ఎంఐఎం పార్టీ ఉందని, ఓటు నల్లగొండ (Nalgonda) వక్ఫ్ కోసం వేయాలని కోరారు. బీహార్‌లో నలుగురు అభ్యర్థులను లాక్కుని.. ఎంఐఎం పని అయిపోయిందన్నారని, బీహార్‌లో 25 మంది, ఔరంగాబాద్‌లో 33 మంది గెలిచి ఎంఐఎం సత్తా చాటిందన్నారు. ముంబైలో 33 మంది, మహారాష్ట్రలో 125 మంది గెలిచారని చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి పార్టీలు ఓటు కోసం డబ్బులు పంచితే తీసుకుని, ఓటు మాత్రం మజ్లిస్‌కే వేయాలన్నారు అసదుద్దీన్ ఓవైసీ.


