కలం, స్పోర్ట్స్: లీడ్స్ యునైటెడ్‌పై ఆర్సెనల్ 4-0తో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో లీగ్‌లో ఏడుపాయింట్ల ఆధిక్యంతో అగ్రస్థానాన్ని మరింత బలపర్చుకుంది. ఇటీవల లీగ్‌లో వచ్చిన చిన్న స్థబ్ధతకు ఇది గట్టి సమాధానంగా నిలిచింది. ఈ గెలుపు తర్వాత మిడ్‌ఫీల్డర్ డెక్లాన్ రైస్ (Declan Rice) జట్టుకు కీలక సందేశం ఇచ్చినట్లు సమాచారం. ఇకపై ప్రతి మ్యాచ్ ఒక కప్ ఫైనల్‌లా ఉంటుందని, వరుసగా గెలవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. జట్టు బలమైన స్థితిలో ఉందని కూడా రైస్ చెప్పినట్లు తెలుస్తోంది.
మికెల్ ఆర్టెటా జట్టు రెండు అర్ధాల్లో రెండేసి గోల్స్ చేసి పూర్తి ఆధిపత్యంతో గెలిచింది. గత వారం మాంచెస్టర్ యునైటెడ్ చేతిలో ఎదురైన ఓటమి తర్వాత ఇది ముఖ్యమైన కమ్‌బ్యాక్‌గా మారింది. ఇటీవలి నెలల్లో లీడ్స్‌లో చెల్సీ, లివర్‌పూల్, మాంచెస్టర్ యునైటెడ్ సాధించలేని మూడు పాయింట్లు ఆర్సెనల్ ఖాతాలో వేసుకుంది. ఇక లీగ్‌లో మిగిలిన 14 మ్యాచ్‌లలో తదుపరి సండర్ల్యాండ్‌తో పోరు ఉంది.
ఇదిలా ఉండగా, ఆర్సెనల్ స్టార్ బుకాయో సాకా గాయంతో ఈ మ్యాచ్ (Match)కు దూరమైనట్లు తెలుస్తోంది. వార్మప్ సమయంలో చిన్న ఇబ్బంది రావడంతో ఆడలేదని సమాచారం. గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత లేదు. ముందున్న కీలక మ్యాచ్‌లలో సాకా త్వరగా కోలుకోవాలని ఆర్సెనల్ ఆశిస్తోంది.
Read Also: ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో క్రీడా దిగ్గజాలు!
Follow Us On: Sharechat


