కలం, తెలంగాణ బ్యూరో : ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ (Union budget) ప్రవేశపెట్టే సమయంలో ఆదాయపు పన్నుల్లో (Income Tax) ఎలాంటి ఊరట ఉంటుందంటూ టాక్స్ పేయర్లు, మిడిల్ క్లాస్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఈసారి కూడా అలాంటి భావనతోనే ఉన్నారు. కానీ గతేడాది పెట్టిన శ్లాబ్లే తప్ప ఈసారి కొత్తగా ఇచ్చిన ఉపశమనం ఏమీ లేదు. ఎలాంటి మార్పులు చేయడంలేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే పన్ను చెల్లింపుదారులకు కొన్ని ప్రొవిజన్లలో మాత్రం వెసులుబాటు కల్పించారు. ప్రతీ ఏటా టాక్స్ పేయర్లు సమర్పించే ఐటీఆర్ దాఖలు గడువును ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు.
ఐటీ శ్లాబ్ సిస్టమ్ ఈసారి ఇలా :
ఐటీ యాక్ట్ పాత పన్ను విధానంలో కొనసాగుతున్నవారికి రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్యాకేజీలు, విదేశీ విద్య, వైద్యం కోసం చేసే చెల్లింపులపై టీసీఎస్ (TCS) రేట్లను కేంద్ర సర్కార్ ప్రస్తుతం ఉన్న 5% నుంచి 2%కి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాన్ని ఈ ఏడాది ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమలు చేయనున్నది. ఆ ప్రకారం కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను శ్లాబ్లు ఇలా ఉంటాయి. వార్షికాదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆదాయపు పన్ను విధింపు ఉండనుంది.
• రూ. 4 లక్షల వరకు పన్ను విధింపు ఉండదు.
• రూ. 5-8 లక్షల వరకు 5%
• రూ. 9-12 లక్షల వరకు 10%
• రూ. 13-16 లక్షల వరకు 15%
• రూ. 16-20 లక్షల వరకు 20%
• రూ. 21-24 లక్షల వరకు 25%
• రూ. 25 లక్షలకు పైన 30%
Read Also: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
Follow Us On: X(Twitter)


