కలం, వెబ్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ (Central Budget) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాలకు వెళ్లే వారికి భారీ శుభవార్త తెలిపారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్య, వైద్య అవసరాల కోసం చెల్లించే మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్) రేటును 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేస్తున్న వారి కోసం, ప్రభుత్వం విదేశీ టూర్ ప్యాకేజీలపై ఉన్న 5 శాతం, 20 శాతం ఉన్న టీసీఎస్ 2 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు.
దీనివల్ల అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకొనేటప్పుడు ముందస్తు పన్ను భారం తగ్గుతుంది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద విద్య లేదా వైద్య చికిత్స కోసం విదేశాలకు డబ్బు పంపే కుటుంబాలకు, టీసీఎస్ (TCS)ను 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించడం భారీ ఊరట కలిగిస్తుంది. అలాగే, పన్నుఎగవేతదారులకు జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించిన కేంద్రం. ఇక నుంచి పన్నుఎగవేతదారులకు 30 శాతం పెనాల్టీ విధించనున్నట్లు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.
Read Also: సెమీ కండెక్టర్ రంగానికి రూ. 40 వేల కోట్ల కేటాయింపులు
Follow Us On: Instagram


