కలం వెబ్ డెస్క్: నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య(Excise Constable Soumya) మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం తెలియజేశారు. విధి నిర్వహణలో ఆమెకు జరిగిన ప్రమాదంపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు. జనవరి 23న నిజామాబాద్ జిల్లా మాధవనగర్ శివారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో గంజాయి తరలిస్తున్న ముఠా సౌమ్యను కారుతో ఢీకొట్టి పారిపోయింది. ఈ ఘటనలో సౌమ్య తీవ్ర గాయాలపాలైంది. ఆమెకు ముందుగా సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సౌమ్య శనివారం రాత్రి 9 గంటలకు తుది శ్వాస విడిచింది. సౌమ్యను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠాను పోలీసులు అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సౌమ్య అందరూ డిమాండ్ చేస్తున్నారు.


