కలం, వెడ్ డెస్క్ : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ (Union Budget 2026-27) ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్ సభలో ప్రవేశపెట్టారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న వేళ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు బడ్జెట్ రూపకల్పన చేశారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. ఆదివారం అయినా ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఆనవాయితీని కేంద్రం కొనసాగించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే లోక్ సభలో విత్త మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 54. లక్షల కోట్లుగా ఉంది. ఇందులో మూలధన వ్యయంలో రూ. 12.2 లక్షల కోట్లు మౌళిక సదుపాయాలకు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే 9శాతం ఎక్కువ.
Read Also: కేంద్ర బడ్జెట్ : ఆసక్తికర విశేషాలు
Follow Us On: Pinterest


