epaper
Friday, January 30, 2026
spot_img
epaper

రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గ పోరు.. బీ ఫామ్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

కలం, నల్లగొండ బ్యూరో : మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ లో వర్గ పోరు రచ్చకెక్కింది. ఇన్నాళ్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ అంతా ఏకతాటిపై ఉన్నారంటూ చెప్పుకొస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Rajgopal Reddy) ఊహించని షాక్ తగిలింది. చండూరు మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) భాగంగా కాంగ్రెస్ లీడర్ల మధ్య అంతర్గత పోరు బట్టబయలైంది. చండూరు మున్సిపాలిటీలో (Chandur Municipality) 10వ వార్డుకు కాంగ్రెస్ నేత భూతరాజు వేణు నామినేషన్ దాఖలు చేశారు.

అయితే అతడికి మున్సిపల్​ ఎన్నికల (Municipal Elections) కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ దక్కలేదు. వేణుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీఫామ్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా.. స్థానిక కాంగ్రెస్ లీడర్లు అడ్డుకుంటున్నారంటూ వేణు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. దీంతో వేణు ఏళ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాదని ఇతరులకు బీ ఫామ్ ఇచ్చారంటూ ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే వేణు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు వేణును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

Read Also: కేంద్ర జల శక్తి శాఖ భేటీపై తెలంగాణ ఫైర్.. నీటి లెక్కలపై అసంతృప్తి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>