కలం, వెబ్ డెస్క్: కేంద్ర జల శక్తి శాఖ భేటీపై తెలంగాణ ఇంజినీర్లు, నీటిపారుదలరంగ నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల డీపీఆర్లకు అనుమతులు, నీటి వినియోగ లెక్కల (Water Disputes) కోసం టెలిమెట్రీల ఏర్పాటు, ఏపీ రాయలసీమ లిఫ్ట్ విస్తరణ, నీటి మళ్లింపునకు సంబంధించిన అంశాలను తెలంగాణ అధికారులు లేవనెత్తారు.
అన్నీ పరిష్కారం నోచుకోని సమస్యలేనని, ఏవీ కొత్తవి కావని, రాష్ట్ర విభజన నాటి నుంచి కొనసాగుతున్న వివాదాలే అన్నారు. 12 ఏళ్లుగా తెలంగాణ (Telangana) ఎన్నోసార్లు విజ్ఞప్తులు, ఫిర్యాదులు చేసిందని నిపుణులు అన్నారు. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయితే తప్ప సమస్యలకు పరిష్కారం రాదని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రాజెక్టులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, రాయలసీమ లిఫ్ట్‌తో పాటు ఇతర అంశాలు న్యాయస్థానాల్లో విచారణలో ఉందని, ట్రిబ్యునల్ వాదనలు తుది దశకు చేరాయని, అయినా కేంద్రం హడావుడిగా కమిటీ ఏర్పాటు చేయడంపై తెలంగాణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.
గత సమావేశాల్లో ఏపీ పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును ముందుకు తెచ్చిందని, మొదట సమావేశానికి రానని చెప్పి, చివరకు హాజరై కమిటీకి అంగీకరించిందని విమర్శించారు. కేంద్రం పాత్రపై పలు అనుమానాలున్నాయని, గతంలో లేనివిధంగా కమిటీ ఏర్పాటు చేయడం ఏపీకి మేలు చేసేందుకేనన్న విమర్శించారు.
Read Also: మేడారం వెళ్తున్నారా.. ఇవి కచ్చితంగా తెలుసుకోండి..
Follow Us On: Instagram


