కలం మెదక్ బ్యూరో: మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కి సిట్ నోటీసులు ఇవ్వడంపై తన సొంత గ్రామం చింతమడక (Chintamadaka) లో బిఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు నిరసనకు దిగారు. గ్రామంలోని చౌరస్తాలో బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపి సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నిన్న విచారణకు రావాలని కేసీఆర్‌కి సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ, సీఎం రేవంత్ కక్షపూరితంగా కేసీఆర్ నోటీసులు ఇచ్చాడని, వెంటనే విచారణ ఆపాలని చింతమడక బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.


