కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై నేడు హైకోర్ట్ విచారణ చేపట్టింది. ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, కాలేజీల నుండి వేధింపులకు గురవుతున్న విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
Read Also: దానంపై అనర్హత వేటు ఖాయం : పాడి కౌశిక్ రెడ్డి
Follow Us On: X(Twitter)


