epaper
Friday, January 30, 2026
spot_img
epaper

ఫైనల్​కు దూసుకెళ్లిన ఆర్​సీబీ

కలం, వెబ్​డెస్క్​: మహిళల ప్రీమియర్ లీగ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది (RCB – UP Warriorz). గురువారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో యూపీ వారియర్స్​ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తుదిపోరుకు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన యూపీ 20ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఓపెనర్​గా వచ్చిన దీప్తి శర్మ(55; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్​) అర్ధ సెంచరీ చేసింది. మిగిలినవాళ్లలో కెప్టెన్​ మెగ్​ లానింగ్​(41; 30 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్​) మినహా ఎవరూ సరిగా ఆడలేదు. ఆర్​సీబీ బౌలర్లలో నదిన్​ డి క్లెర్క్​ 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. గ్రేస్​ హారిస్​ 2 వికెట్లు, శ్రేయాంక పాటిల్​, లారెన్​ బెల్​ చెరో వికెట్​ తీశారు.

అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్​సీబీ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది (RCB – UP Warriorz). ఓపెనర్​ గ్రేస్​ హ్యారిస్​ (75; 37 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్​లు) ఎడాపెడా ఫోర్లు, సిక్స్​లతో చెలరేగింది. మరో ఓపెనర్​, కెప్టెన్ స్మృతి మంధాన (54 నాటౌట్: 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్​లు) సైతం వేగంగా ఆడింది. చివరి వరకూ నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. జార్జియా వోల్ (16; 15 బంతుల్లో 2 ఫోర్లు) ఓ మోస్తరు పరుగులు చేసింది. శిఖా పాండే, ఆశా శోభన చెరో వికెట్​ తీశారు. ఈ ఓటమితో ప్లేఆఫ్​ అవకాశాలను యూపీ సంక్లిష్టం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>