కలం, వెబ్ డెస్క్: పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. డ్రగ్ స్మగ్లర్లపై భారీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం అమృత్‌సర్‌లో అధికారులు సుమారు రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ సరుకు పాకిస్థాన్ నుంచి అక్రమంగా తరలించినట్టు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ పట్టివేతలో గ్రామ రక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాయి.
ఈ విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. గ్రామస్థుల అప్రమత్తత వల్లే ఈ భారీ డ్రగ్స్ సరుకు పట్టుబడిందని తెలిపింది. పంజాబ్‌ను డ్రగ్ రహిత, గ్యాంగ్‌స్టర్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తోందని, ఇది పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దూరదృష్టి, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దృఢ సంకల్పానికి నిదర్శనమని ఆప్ పేర్కొంది.
జనవరి 7న పంజాబ్‌లోని ఫగ్వారాలో అరవింద్ కేజ్రీవాల్, సీఎం భగవంత్ మాన్ కలిసి డ్రగ్స్ (Drugs)కు వ్యతిరేక ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ప్రజల భాగస్వామ్యం చేస్తూ, సాంకేతికతను వినియోగిస్తుండటంతో పంజాబ్ (Punjab)లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతోంది.


