epaper
Friday, January 30, 2026
spot_img
epaper

కేసీఆర్ లెటర్‌కు సిట్ రిప్లై

కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరుకావడంపై కేసీఆర్ (KCR) ఇచ్చిన రిప్లై మీద సిట్ స్పందించింది. నోటీసులో పేర్కొన్న జనవరి 30 తేదీకి బదులుగా ఏ రోజు విచారణకు హాజరు కావడానికైనా సిద్ధమంటూ కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సిట్ ఆయన కోరిక మేరకు తగిన సమయం ఇవ్వాలని నిర్ణయించింది. ఏ రోజు ఎంక్వయిరీ జరపనున్నదీ శుక్రవారం తెలియజేస్తామని వెల్లడించింది.

విచారణ జరిగే స్థలం ఎర్రవల్లిలో కేసీఆర్ ఉంటున్న ఫామ్ హౌజ్ అని తేలినా ఏ రోజు జరుగుతుందనేది సిట్ వెల్లడించనున్నది. ఆలస్యం చేయకుండా వెంటనే ఎంక్వయిరీని పూర్తి చేయాలన్నది సిట్ భావన. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 1 రాత్రికి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఆ సమయానికల్లా సిట్ తన ఎంక్వయిరీని పూర్తి చేస్తుందా?.. జనవరి 31 లేదా ఫిబ్రవరి 1 తేదీల్లో ఏ డేట్‌ను ఫిక్స్ చేస్తుంది?.. లాయర్లు లేకుండా ఆయనను ఒంటరిగానే విచారిస్తుందా?.. ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>