కలం, వరంగల్ బ్యూరో : మేడారం మహా జాతరలో (Medaram Jatara) అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తులు వేయీ కళ్లతో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. గిరిజన సంప్రదాయాల నడుమ వనదేవత సమ్మక్క తల్లి (Sammakka) జనప్రవేశం చేయడంతో మేడారం పరిసరాలు భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి.
చిలుకలగుట్టపై సమ్మక్క తల్లి (Sammakka) రూపమైన కుంకుమ భరిణెను పూజారులు తీసుకురాగానే, ములుగు జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం, డప్పుల మోత, భక్తుల జయజయధ్వానాల మధ్య తల్లి గద్దెల వైపు కదిలింది.
లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ, తల్లి ఊరేగింపు సాఫీగా సాగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ విచారణకు హాజరవడంపై కేసీఆర్ క్లారిటీ
Follow Us On: Sharechat


