కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల నెట్వర్క్ రూపురేఖలను మార్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2 లేన్ల జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించాలని, దీనికి సంబంధించి పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
రహదారుల విస్తరణ, రోడ్ డెన్సిటీ పెంపు వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక బెంచ్ మార్క్‌గా నిలవాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్‌హెచ్ ప్రాజెక్టుల పురోగతితో పాటు, కొత్తగా చేపట్టాల్సిన రహదారుల నిర్మాణంపై కూడా చర్చించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
Read Also: జిరాఫీలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం
Follow Us On: X(Twitter)


