కలం, వెబ్ డెస్క్: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులది కీలక పాత్ర. రెస్ట్ అనేది లేకుండా నిరంతరం విధులకే అంకితమవుతుంటారు. ఈ నేపథ్యంలో కర్ణాటక (Karnataka) ప్రభుత్వం పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు అధికారులు, సిబ్బంది తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం సందర్భంగా సెలవు కోరితే తప్పనిసరిగా మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక డీజీపీ సర్క్యులర్ విడుదల చేశారు. కఠిన పరిస్థితుల్లో సమర్థమంతమైన విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ముఖ్యమని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
బర్త్ డే, వెడ్డింగ్ డేలకు సెలవు (Leave) ఇవ్వడం వల్ల పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా ఉంటారని, ఫ్యామిలీతో సమయం కేటాయించే అవకాశం దొరుకుతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అటు ఉద్యోగం, ఇటు పర్సనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ అవుతుందని, రెట్టింపు ఉత్సాహంతో పోలీస్ సిబ్బంది పనిచేసే అవకాశం ఉందన్నారు. ఈ ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని యూనిట్ అధికారులకు వర్తిస్తాయని డీజీపీ స్పష్టం చేశారు.
Read Also: డంబెల్‌తో మోది మహిళా కమాండో దారుణ హత్య
Follow Us On: Sharechat


