కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) స్పందించారు. సిట్ విచారణ నాన్ సీరియస్‌గా జరుగుతోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టే ప్రభుత్వం హడావుడి చేస్తోందని పేర్కొన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే. మరి అసలైన నేరస్థులకు శిక్ష పడుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి‘ అని కవిత పేర్కొన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కూడా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని కవిత వ్యాఖ్యానించారు. ‘ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదు. ఫోన్ ట్యాపింగ్ విచారణను తొందరగా కంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కచ్చితంగా చాలా బాధాకరం. కానీ ప్రభుత్వం ఏ స్థాయిలో విచారణ జరుపుతుందో అర్థం కావడం లేదు‘ అంటూ వ్యాఖ్యానించారు.
త్వరలో కవిత (Kavitha) కూడా ఈ కేసులో బాధితురాలిగా విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత ఆరోపించారు. ఈ అంశం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అవ్వడం ఒకెత్తు అయితే.. నేరుగా కేసీఆర్ కుటుంబసభ్యురాలైన కవిత ఫోనే ట్యాప్ కావడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. మరి ఫోన్ ట్యాపింగ్ విచారణ అంశం మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? బీఆర్ఎస్ పార్టీకి మైనస్‌గా మారుతుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: మేడారంలో భక్తుల రికార్డు: మంత్రి పొంగులేటి
Follow Us On: Sharechat


