epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

కల్కి 2లో సాయిపల్లవి.. అసలు నిజం ఇదే..

కలం, సినిమా: హీరోయిన్ అంటే గ్లామర్ ఉండాలనే గ్రామర్ ను మార్చేసింది సాయి పల్లవి (Sai Pallavi). గతంలో కొందరు హీరోయిన్స్ తమ పర్ ఫార్మెన్స్ తోనే ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలాంటి నాయికగా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఇన్ని రోజులు టైర్ 2 హీరోలతోనే ఆడిపాడిన ఈ భామ…ఇప్పుడు ఫస్ట్ టైమ్ బిగ్ లీగ్ లోకి వెళ్లబోతోంది. ఆమె ప్రభాస్ కల్కి 2 మూవీలో నాయికగా సెలెక్ట్ అయ్యిందనే న్యూస్ వైరల్ గా మారింది.

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్ కల్కి 2 ఇప్పుడు సన్నాహాల్లో ఉంది. కల్కి లో దీపిక హీరోయిన్ కాగా… ఆమె పని గంటల విషయంలో వివాదం రేపి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడా ఛాన్స్ సాయి పల్లవికి దక్కినట్లు.. దీపిక ప్లేస్ లో సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదని.. కల్కి 2 మేకర్స్ సాయిపల్లవిని కాంటాక్ట్ చేయలేదని తెలిసింది.

కల్కి 2 సినిమా కోసం ప్రభాస్ డేట్స్ కూడా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మాణంలో అశ్వనీదత్ నిర్మిస్తుండగా, దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కల్కి 2 లో నటించనున్నారు. రెబల్ ఫ్యాన్స్ కల్కి 2 (Kalki 2) పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>