epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

ప్రభాస్ లైనప్ మారిందా..?

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో  భారీ సినిమాలు ఉన్నాయి. ఇటీవల ప్రభాస్ నటించిన రాజాసాబ్ (Rajasaab) సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేకపోయింది. దీనితో రాజాసాబ్ ఎఫెక్ట్ నెక్ట్స్ సినిమాలపై పడింది. అందుకే ప్రభాస్ తన లైనప్ మార్చాడనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ (Spirit), ఫౌజీ (Fouji) సినిమాలు చేస్తున్నాడు. ఫౌజీ సినిమా 70 శాతం పూర్తయ్యింది. స్పిరిట్ ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాని వీలైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగా  పక్కా ప్లాన్ సిద్దం చేశాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సలార్ 2 సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని అనుకున్నాడు. అయితే.. ఇప్పుడు ప్లాన్ మార్చి “కల్కి 2” ని పట్టాలెక్కించడానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది . ఫిబ్రవరిలో  కల్కి 2 షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్  నెలలో 10 రోజులు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.

ఫ్యాన్స్ కోసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభాస్ ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. కానీ రిలీజ్ విషయంలోనే ఇబ్బంది తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ముందుగా కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేసి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని ప్రభాస్ (Prabhas) భావిస్తున్నట్లు సమాచారం.

Read Also:  పెద్ది ప్లేస్ లో విశ్వంభర నిజమేనా..?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>