epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

అజిత్​ మృతిపై శరద్​ పవార్​ రియాక్షన్​​ ఇదే ​

కలం, వెబ్​డెస్క్​: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ (Ajit Pawar) బుధవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై వస్తున్న ఊహాగానాలకు, అనుమానాలకు ఎన్​సీపీ అధినేత, అజిత్​ పవార్​ బాబాయ్​ శరద్​ పవార్​ (Sharad Pawar) చెక్​ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బారామతిలోని అహిల్యాబాయి హాస్పిటల్​కు కుటుంబంతో కలసి చేరుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘అజిత్​ మరణం రాష్ట్రానికి తీరని లోటు. అతని స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరు. ఈ దుర్ఘటన ప్రమాదమే. రాజకీయంతో సహా వేరే కోణమేదీ లేదు’ అని అన్నారు.

అంతకుముందు అజిత్​ పవార్​ మరణంపై పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీతోపాటు మధ్యప్రదేశ్​ మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్​, గౌరవ్​ గొగోయ్​ సహా అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ‘బీజేపీ పాలనలో రాజకీయ నాయకులకు ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు భద్రత లేకుండా పోతోంది. ఈరోజు జరిగిన సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. మన నమ్మకం కేవలం సుప్రీంకోర్టు మీద మాత్రమే. మిగిలిన ఏ సంస్థనూ నమ్మలేం’ అంటూ అజిత్​ మరణంపై మమత వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రమాదంపై పూర్తి పారదర్శకంగా విచారణ జరగాలి. ఎందుకంటే అచ్చం ఇలాంటి సంఘటనే, మూడేళ్ల కిందట ఇదే ఏవియేషన్​ సంస్థకు చెందిన విమానం విషయంలో జరిగినట్లు నా దగ్గర సమాచారం ఉంది’ అని దిగ్విజయ్​ అన్నారు.

కాగా, బాబాయ్​ సారథ్యంలోని ఎన్​సీపీ నుంచి తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి 2023లో అజిత్​ పవార్​ వేరుపడిన సంగతి తెలిసిందే. అజిత్​ వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ పేరు, గుర్తు కూడా అజిత్​కే దక్కాయి. అనంతరం బీజేపీ సారథ్యంలోని మహాయుతిలో చేరి, డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే, ఇటీవల మహారాష్ట్ర పురపాలిక ఎన్నికలకు ముందు తిరిగి బాబాయ్​ శరద్​ పవాద్​ (Sharad Pawar) తో అజిత్​ కలిశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్​ మరణించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వాటన్నిటికీ చెక్​ పెట్టేలా శరద్​ పవార్​ తేల్చేయడంతో ప్రస్తుతం ఎన్​సీపీ అభిమానులు కాస్త శాంతించారు. మరోవైపు ప్రమాదంపై డీజీసీఏ, ఏఏఐబీ దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also: అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్ : కీలక విషయాలు వెల్లడించిన DGCA

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>