కలం, నల్లగొండ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏదో ఒకరోజు బాంబు పేలుస్తానని, మునుగోడు అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని రేవంత్ హామీ ఇచ్చారని, మూడు వారాలు దాటినా బిల్లులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో చేసిన పలు పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలో ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి భట్టిని అడిగితే బిల్లులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారన్నారు. కొడంగల్, మధిర, హుజూర్ నగర్ నియోజకవర్గాలకే నిధుల కేటాయింపు జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ఆరోపించారు. బిల్లుల (Bills) కోసం ఎదురుచూసి విసిగిపోయానని, తక్షణమే బిల్లులు చెల్లించకపోతే ఏదో ఒకరోజు బాంబు పేలుస్తానని హెచ్చరించారు.
Read Also: దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్: పొంగులేటి
Follow Us On : WhatsApp


