కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో మరణించడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ విషాద ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆమె పేర్కొన్నారు. దేశంలో సామాన్య ప్రజలకే కాకుండా రాజకీయ నాయకులకు కూడా భద్రత కరువైందని ఆమె పేర్కొన్నారు.
అజిత్ పవార్ తిరిగి తన సొంత పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం లేదని, అందుకే ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. తమకు కేవలం అత్యున్నత న్యాయస్థానంపైనే పూర్తి విశ్వాసం ఉందని ఆమె తెలిపారు.
Read Also: ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా.. రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Follow Us On: Sharechat


