epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: ప్రకృతి విపత్తులను సమర్థమంతంగా ఎదుర్కొనేలా రాష్ట్రంలో ప్రకృతి విప‌త్తుల నిర్వహణ సంస్థ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌)ను బలోపేతం చేసి దేశానికే రోల్ మోడ‌ల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti) అన్నారు. ఎలాంటి విపత్తుల‌నైనా ఎదుర్కొనేలా వంద కోట్ల రూపాయిల‌తో అత్యాధునిక ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణయించామన్నారు. బుధ‌వారం స‌చివాల‌యంలోని విప‌త్తుల నిర్వహణ విభాగం, ఫైర్ స‌ర్వీసెస్‌, ఎస్‌డీఆర్ఎఫ్‌, హైడ్రా, ఐసీసీసీ విభాగాల‌తో ఆయన స‌మావేశమయ్యారు.

వరదలు, అగ్నిప్రమాదాల (Fire Accidents)పై త్వరగా స్పందిచేందుకు డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్క్యూ పరికరాలు, అత్యాధునిక ఫైర్ & సెర్చ్ ఆపరేషన్ల సాంకేతికతను అందుబాటులోకి తెస్తామన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ సిబ్బందికి అత్యుత్తమ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని పొంగులేటి సూచించారు. స్థానిక ప‌రిస్థితులను బ‌ట్టి మండ‌లస్థాయి వరకు అడ్వాన్స్‌డ్ వెద‌ర్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌న్నారు. భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వాగుల్లో వంక‌ల్లో చెరువుల్లో చిక్కుకున్నవారిని ర‌క్షించ‌డానికి ఎయిర్‌లిఫ్ట్ మెకానిజం త‌యారు చేసుకోవాల‌ని సూచించారు. ఎయిర్ లిఫ్ట్ వ్యవస్థ స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల గతేడాది పాలేరులో చిక్కుకున్న బాధితుల‌ను ర‌క్షించుకోలేక‌పోయాన‌ని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.

హైద‌రాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా మాట్లాడ‌డానికి వీలుగా సిమ్ ఆధారిత విహెచ్ ఎఫ్ రేడియో సిస్టమ్స్‌ను అందుబాటులోకి తేవాల‌ని సూచించారు. హైద‌రాబాద్‌లో హైరైజ్డ్ భ‌వ‌నాల‌లో అగ్ని ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్‌కు సూచించారు. అలాగే 77 హైస్పీడ్ బోట్‌ల‌ను కొనుగోలు చేయాల‌ని, రాష్ట్రంలో 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయ‌ని, వీరికి మెరుగైన శిక్షణ ఇవ్వాలన్నారు.

మేడారం (Medaram) మహా జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti) అన్నారు. మేడారం జాతరలో మొదటి ఘట్టం ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణపై కీలక సూచనలు చేశారు. మేడారంలో భక్తుల సంఖ్య , సారలమ్మ వార్ల రాక ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, జాతరలో నెలకొన్న పరిస్థితులు గురించి మంత్రి ఆరాతీశారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.

Read Also: ఫిరాయింపుల కేసు.. దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>