epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

నా వీడియోల‌ను నేనే సోష‌ల్ మీడియాలో లీక్ చేశా- బాధిత మ‌హిళ

కలం, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే (Jana Sena MLA) అరవ శ్రీధర్ ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే బాధితురాలు బుధవారం మీడియా ముందుకొచ్చి సంచలన విషయాలను వెల్లడించింది. తన వీడియోల‌ను తానే సోష‌ల్ మీడియాలో లీక్ చేశానని, పెళ్లి చేసుకోనందు వల్లే తాను లీక్ చేశానని చెప్పింది.

ఎమ్మెల్యే బెదిరిస్తున్న వీడియోలు తన వద్దని ఉన్నాయని, అవి కోర్టులో సబ్మిట్ చేస్తానని అన్నారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు తీసుకోలేదని ఆమె అన్నారు. మొన్న సంక్రాంతికి నారావారి పల్లె వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు (Chandrababu)కు సైతం ఈ విషయం వివరంగా చెప్పానన్నారు. ఆయన అందరి దగ్గర అర్జీలు తీసుకున్నట్టే నా దగ్గర కూడా అర్జీ తీసుకొని గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారని ఎమ్మెల్యే బాధితురాలు చెప్పింది.

ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉందనే విషయమై మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. ‘‘లీక్ అయిన వీడియోలో మిమ్మల్ని ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లు లేదని, మీరే ఆయనను రెచ్చగొడుతున్నట్లు ఉందని’’ ప్రశ్నించగా బాధిత మహిళ పైవిధంగా స్పందించింది. కాగా జనసేన ఎమ్మెల్యే (Jana Sena MLA) గురించి మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

Read Also: గ్రూప్‌-2 తుది జాబితా విడుద‌ల చేసిన ఏపీపీఎస్సీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>