కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం పూణే జిల్లాలోని బరామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. “దాదా మనల్ని వదిలి వెళ్లిపోయాడు” అంటూ సంతాపం ప్రకటించారు.
“నా స్నేహితుడు, సహోద్యోగి, ప్రజా నాయకుడైన అజిత్ దాదా ఈ ప్రమాదంలో మరణించారనే వార్త నన్ను ఎంతో కలిచివేసింది. ఆయన ఒక బలమైన, ఉదార హృదయం గల స్నేహితుడు” అని ఫడ్నవీస్ (Devendra Fadnavis) పేర్కొన్నారు. ‘ఈ ఘటనతో వ్యక్తిగతంగా నేనెంతో కోల్పోయాను.
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. నేడు (బుధవారం) రాష్ట్రంలో సెలవును ప్రకటించారు. ప్రమాద ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించింది. గతంలో కూడా ఈ విమానం 2023లో ఒకసారి క్రాష్ ల్యాండింగ్‌కు గురైనట్టు సమాచారం. అజిత్ పవార్ మరణంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాలకు ఇది తీరని లోటని నేతలు అభివర్ణిస్తున్నారు.
Read Also: నిజామాబాద్‌పై మూడు పార్టీల స్పెషల్ ఫోకస్..!
Follow Us On: Pinterest


