కలం, నల్లగొండ బ్యూరో: చెరువుగట్టు ఆలయ (Cheruvugattu) ప్రాంగణమంతా శివనామస్మరణతో దద్దరిల్లింది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన అగ్ని గుండాల కార్యక్రమం (Agni Gundalu Event) బుధవారం తెల్లవారుజామున ఘనంగా ముగిసింది.
భక్తులు భక్తి శ్రద్ధలతో ఓం నమశ్శివాయ అంటూ అగ్ని గుండం దాటుతూ తమ మొక్కలు తీర్చుకున్నారు. ఈ అగ్ని గుండాల కార్యక్రమానికి నల్లగొండ జిల్లా నుంచి భారీగా భక్తులు, శివసత్తులు తరలివచ్చారు. భగ భగ మండే నిప్పు కణికల్లో నడిచి భక్తి భావం చాటుకున్నారు. ఈసారి అగ్ని గుండాల కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Read Also: మేడారం మహా జాతర ప్రారంభం
Follow Us On: X(Twitter)


