కలం, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై (Perni Nani) కృష్ణా జిల్లా ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పేర్ని నాని ఇటీవల ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పేర్ని నానిపై BNS 196 (1), 353 (2), 351 (2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: AI వీడియో.. పవన్ కళ్యాణ్ కుమారుడికి ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్
Follow Us On: Sharechat


