epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

ఈయూ డీల్: చాక్లెట్స్ To లగ్జరీ కార్స్.. ఇండియాలో ఇక డెడ్ చీప్

కలం, తెలంగాణ బ్యూరో: టారిఫ్ లతో ట్రంప్ మన దేశంపై రెచ్చిపోతున్న వేళ.. యూరోపియన్ యూనియన్ (EU) మనకు గుడ్ న్యూస్ చెప్పింది. 27 దేశాలతో కూడిన ఈయూతో ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (India-EU FTA) ఓకే అయింది. ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ (Mother of All Deals)’ అంటూ దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈయూతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదరడంతో మనకు వచ్చే లాభం ఏమిటి? మనకు మిగిలేది ఏమిటి?! చాక్లెట్లు, వైన్ నుంచి మొదలు లగ్జరీ కార్ల వరకు పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. అయితే.. ఇవి ఇప్పుడే కాదు! మరో ఏడాది వరకు టైమ్ పట్టొచ్చు. ఎందుకంటే.. ఈయూ కూటమిలోని 27 దేశాలు తమ పార్లమెంట్ల లో ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం ఆరు నుంచి ఎనిమిది నెలల టైమ్ పడ్తుంది.

లగ్జరీ కార్ల రేట్లు దిగివస్తాయి:

మెర్సిడీస్ (Mercedes), బీఎండబ్ల్యూ (BMW), ఆడి (Audi) వంటి కార్లు మనకు ఈయూ దేశాల నుంచి వస్తుంటాయి. ప్రస్తుతం వీటిపై 100% కంటే ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం) ఉంది. తాజా ఒప్పందం ప్రకారం చూస్తే.. రూ. 16 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై సుంకం 40 శాతానికి తగ్గుతుంది. ఆ తర్వాత 10 శాతానికి తగ్గుతుంది. ఫ్రీ ట్రేడ్ తో ఆ మేరకు ఆయా కార్ల రేట్లూ దిగి వస్తాయి.

మద్యం ప్రియులకు కిక్:

మన దేశానికి ఈయూ భాగస్వామ్య దేశాలైన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ నుంచి వైన్ (wine), విస్కీ (whisky), స్పిరిట్ దిగుమతి అవుతుంటుంది. ఫ్రీ ట్రేడ్ వల్ల వీటి రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటిపై 150 % వరకు దిగుమతి సుంకం ఉంది. ఒప్పందం కారణంగా ఇది 30 నుంచి 20 శాతానికి చేరనుంది.

మెడిసిన్స్ చీప్:

ఇండియా ఈయూ ఫ్రీ ట్రేడ్ (India-EU FTA) వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులకు ఈయూ నుంచి మనం దిగుమతి చేసుకునే మెడిసిన్స్ రేట్లూ తగ్గనున్నాయి. ఈ మెడిసిన్స్ పై ప్రస్తుతం ఈయూ దేశాలు 27 శాతం వరకు టారిఫ్ వేస్తున్నాయి. తాజా అగ్రిమెంట్ మేరకు దాదాపు 90 శాతం మెడిసిన్స్ పై ఎలాంటి టారిఫ్ ఉండదు.

తక్కువ ధరలకే ఫోన్లు, ఇనుము:

ఈయూ దేశాల నుంచి వచ్చే మొబైల్స్, ఇనుము, ఉక్కు, కెమికల్స్ పై ప్రస్తుతం దాదాపు 44 శాతం వరకు టారిఫ్ ఉంది. అది జీరో కానుంది. దీంతో వాటి రేట్లు తగ్గీ.. ముఖ్యంగా నిర్మాణ రంగానికి మంచి ఊతం లభిస్తుంది. ఇండ్లను కొనేవారికి, కట్టుకునే వారికి ఖర్చు తగ్గుతుంది.

చాకెట్లు, బిస్కెట్లు, పాస్తాపై జీరో శాతం టారిఫ్ :

ఈయూ దేశాల నుంచి వచ్చే చాక్లెట్లు, బిస్కెట్లు, పాస్తాపై ప్రస్తుతం 50 శాతం వరకు సుంకాలు ఉండగా.. అవి జీరో కానున్నాయి. వాటి రేట్లు కూడా చీప్ అవుతాయి. ఆయా దేశాల నుంచి వచ్చే గొర్రె మాంసంపై ప్రస్తుతం 33 శాతం టారిఫ్ ఉండగా.. అది జీరో అవుతుంది. ఆ మేరకు మాంసం రేట్లూ దిగి వస్తాయి.

Read Also: హార్ట్ టచింగ్ వీడియో.. యజమాని మృతి, 4 రోజులు కాపలా కాసిన కుక్క!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>