కలం, నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri) అన్నారు. మంగళవారం దేవరకొండ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బాలునాయక్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వేలకోట్లు రూపాయలు దోచుకున్నారని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో (Municipal Elections) కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలను దక్కించుకున్నట్టుగానే అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) టికెట్ ఆశించి రానివారికి తగిన న్యాయం చేస్తామని హామీనిచ్చారు. విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజాపాలన అని, అన్నివర్గాల లీడర్లు కలిసికట్టుగా ముందుకుసాగాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
Read Also: 17 మున్సిపాలిటీలు.. 6.68 లక్షల ఓటర్లు, ఉమ్మడి నల్లగొండలో ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షే
Follow Us On: X(Twitter)


