కలం, వెబ్ డెస్క్: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఎట్ హోమ్‌కు నటి సమంత రూత్ ప్రభు (Samantha) హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు అటెండ్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్న ఎట్ హోమ్‌లో (At Home Reception) సమంత ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ” చిన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసినవారు లేరు. ఏదో ఒకరోజు గొప్పదానివి అవుతావని వెన్నుతట్టినవారు లేరు. అంత ధైర్యం నాలోనూ లేదు. రాష్ట్రపతి భవన్‌కు చేరుకునే మార్గం నాకు తెలియదు. కానీ ఇక్కడికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు’’ అని సమంత ఎమోషనల్ అయ్యింది.
ఎట్ హోమ్‌లో సమంత (Samantha) అదిరిపోయే చీరకట్టులో మెరిశారు. ఆకుపచ్చని చీరలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా హుందాగా కనిపించారు. ఇటీవల రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత మళ్లీ సినిమాలతో సందడి చేయబోతోంది. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ నటిస్తోంది.
Read Also: డబ్బింగ్ మొదలు పెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్
Follow Us On: Instagram


