Mobile Popup Ad
Mobile Popup Ad

మేడారం జాతర.. ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేడారం జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే జాతరకు (Medaram Jatara) రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రజా ప్రభుత్వం పునర్నిర్మించిందని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు.

రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, ప్రాంగణానికి నలు దిశలా తోరణాలను నిర్మించినట్లు గుర్తు చేశారు. లక్షలమంది జనం నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాలను పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని అన్నారు.

మేడారం తల్లుల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం

మేడారం తల్లుల స్పూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వనదేవతల దీవెనలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తల్లుల చెంత ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించిందని అన్నారు. జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తిగా రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని అన్నారు. నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అంచనాలు ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి

గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకొని.. మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించాలని అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా భక్తులు సహకరించాలని కోరారు. పోలీసు విభాగంతో పాటు అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా మహా జాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల అధికారులు నాలుగు రోజుల పాటు నిర్విరామంగా భక్తులకు అందుబాటులో ఉండాలని అప్రమత్తం చేశారు.

Read Also: నగదు తీసుకెళ్తున్నారా.. లిమిట్ దాటితే రిస్కే!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>