కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేతుల మీదుగా ఆ శాఖ సిబ్బంది హల్వా (Budget Halwa) రుచి చూశారు. దీంతో ఇక బడ్జెట్ తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో పాల్గొనే ఉద్యోగులంతా ‘లాక్-ఇన్’ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేంత వరకూ ఈ సిబ్బంది గృహనిర్బంధంలోనే ఉండిపోతారు.
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ భవనంలోని సెల్లార్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ (Union Budget 2026-27) ముద్రణ విధుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. బడ్జెట్ ప్రింటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఫైనాన్స్ డిపార్టుమెంటు సిబ్బందికి కుటుంబ సభ్యులతో సంబంధాలుండవ్. మళ్ళీ ఫిబ్రవరి 1 సాయంత్రమే వారు సెల్లార్ నుంచి బైటకు వస్తారు. ఇన్ని రోజుల పాటు అన్ని బంధాలు, సంబంధాలను తెంచుకుని బడ్జెట్ పుస్తకాల ప్రింటింగ్ యాక్టివిటీస్‌లో మునిగిపోయే దాదాపు 65 మంది సిబ్బందికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘బడ్జెట్ హల్వా (Budget Halwa)’ రుచి చూపించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆ శాఖలోని పలు విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Also: యాసిడ్ దాడి నిందితుల ఆస్తుల జప్తు.. బాధితులకు పరిహారం: సుప్రీంకోర్టు
Follow Us On: Sharechat


