epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

సంతోష్ ఎంక్వైరీ వేళ BRS మాస్టర్ ప్లాన్

కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కేసీఆర్‌కు నీడలా ఉండే సంతోష్‌రావు సిట్ ఎంక్వయిరీకి (Santhosh SIT Inquiry) హాజరవుతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతల బృందం లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశానికి టైమ్ ఫిక్స్ అయింది. సింగరేణి బొగ్గు గనుల మైనింగ్ టెండర్ వ్యవహారంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నది. సంతోష్‌రావు ఎంక్వయిరీ హైలైట్ కాకుండా బీఆర్ఎస్ పక్కా స్ట్రాటెజీ రచించిందనే టాక్ మొదలైంది. ఎంక్వయిరీ మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభం కానున్నది. మూడు గంటలకంటే ఎక్కువసేపు విచారించే అవకాశం ఉండకపోవచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నది. లోక్‌భవన్‌లో సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్‌తో బీఆర్ఎస్ టీమ్ భేటీ కానున్నది. ఎంక్వయిరీ జరిగే జూబ్లీహిల్స్ పీఎస్ ముందు ఎలాంటి హడావిడి చేయొద్దని పార్టీ నిర్ణయించింది. మొత్తం అటెన్షన్ లోక్‌భవన్‌వైపు డైవర్ట్ కానున్నది.

సంతోష్ ఎంక్వయిరీతో (Santhosh SIT Inquiry) లీడ్ దొరికేనా?

గత ప్రభుత్వంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సమీప బంధువు సంతోష్‌రావు ప్రగతిభవన్ వేదికగా చక్రం తిప్పారనేది బీఆర్ఎస్ నాయకులే గర్వంగా చెప్పుకునేవారు. కేసీఆర్‌ను కలవాలంటే అప్పటి ఎంపీలు, మంత్రులు సైతం సంతోష్ ద్వారానే రాయబారం నడిపేవారు. అధికారుల బదిలీల మొదలు అనేక కీలక నిర్ణయాల్లో ఆయన పాత్రపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సంతోష్‌ను సంతృప్తిపరిస్తే కేసీఆర్ (KCR) దగ్గర పనులు పూర్తయ్యేవనే సాధారణ అభిప్రాయం ఉండేది. కేసీఆర్‌కు నిత్యం నీడలా ఉండే సంతోష్‌కు తెలియని విషయమంటూ ఉండేది కాదనేది గులాబీ లీడర్లు ఓపెన్‌గానే కామెంట్ చేసేవారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన ఏం చెప్తారు?.. పోలీసులు ఎలాంటి వివరాలను రాబడతారు?.. ఇదీ ఇప్పుడు కీలకంగా మారింది.

ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం ? :

ఫోన్ ట్యాపింగ్‌లో ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్‌ను విచారించిన సిట్ పోలీసులు ఇప్పుడు సంతోష్‌రావును పిలవడం బీఆర్ఎస్‌లో చర్చకు దారితీసింది. ఎంక్వయిరీకి వెళ్ళడానికి ముందే కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. హరీశ్‌రావు, కేటీఆర్‌ల నుంచి పోలీసులు రాబట్టిన వివరాలను సంతోష్ ముందు ప్రస్తావించి మరింత లోతుగా సమాధానాలను రాబట్టే అవకాశమున్నది. ఎంక్వయిరీ ఎలా జరుగుతుందో?.. పోలీసులు ఎలా ఇరుకున పెడతారో?.. ఎలాంటి సమాధానాలు ఇచ్చి సేఫ్ కావాలో?.. ఇలాంటి పలు అంశాలపై పార్టీ పెద్దలు అవగాహన కలిగించినట్లు తెలిసింది. రిటైర్డ్ పోలీసు అధికారుల స్టేట్‌మెంట్‌లలో వెల్లడించిన అంశాలను కూడా పోలీసులు సంతోష్ ముందుంచి వివరాలను రాబట్టే అవకాశమున్నది.

Read Also: నేడో రేపో కవితకు సిట్ నోటీసు?.. ఎవిడెన్స్, స్టేట్‌మెంట్‌పై ఉత్కంఠ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>