కలం, డెస్క్ : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తొలిసారిగా సహకార బ్యాంకుల్లోనూ UPI సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వాణిజ్య బ్యాంకుల్లోనే యూపీఐ సేవలు ఉన్నాయి. రైతుల పంటలకు సంబంధించిన లావాదేవీలు, లోన్లు ఎక్కువగా సహకార బ్యాంకులతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి రైతులకు గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో యూపీఐ (UPI) సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. పొగాకు, ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇది వారికి పెద్ద ఊరట అంటున్నారు కూటమి నేతలు.
Read Also: కడపలో కత్తులతో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. నాలుగు చోట్ల చోరీ
Follow Us On: Instagram


